CASE 01(బ్యాంక్) - అన్వేషణ
రాత్రి నిద్ర రాక పోవడం తో తన ఇన్వెస్టిగేషన్ ఆల్బం ని తీసాడు . అందులో అతను ఇప్పటివరకు సాల్వ్ చేసిన కేసెస్ గురుంచి అన్ని డీటెయిల్స్ ఉన్నాయ్ .కొన్ని సంవత్సరాల ముందు ఈనాడు పేపర్ లో వచ్చిన హెడ్డింగ్ ని చూస్తూ అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయతినిస్తున్నాడు. "పట్టపగలు 100 కోట్ల తో మాయమైన దొంగలు ". తన యాబై సవంత్సరాల కెరీర్లో సాల్వ్ చేసి తనకు గుర్తింపు వచ్చిన చాలా కేసులలో ఇదీ ఒక్కటి . ఇప్పుడు రిటైర్మెంట్ తరువాత ఇవే తన స్నేహితులు . తన చేతిలో ఉన్న కాఫీని సిప్ చేస్తూ సిగార్ ని అంటించి కళ్ళుమూసుకున్నాడు .
అది 2019 లో వర్షాకాలం మెల్లగా పడుతున్న వర్షంలో వేడి టీ ని తాగుతూ తనకు కొత్తగా వచ్చిన కేసు ఫైల్ చూస్తూ ఉన్నాడు. అందరు చూస్తూ ఉండగానే మాయమైన 100 కోట్ల డబ్బు , నలుగురు దొంగలు , పట్టపగలు . తనకి సహాయంగా ఉండడానికి వచ్చిన నలుగురు పోలీసులని తీసుకొని దొంగతనం జరిగిన స్పాట్ కి వెళ్లారు . అప్పటికే దొంగతనం జరిగి మూడు నెలలు గడిచింది . తనకు ఫోరెన్సిక్ రిపోర్ట్ కావాలి అని తన అసోసియేట్ శివ కి చెప్పి కార్ నుండి దిగి బ్యాంకు లోపలి వెళ్ళాడు . దొంగతనం వల్ల బ్యాంక్ కొంచం ఖాళీగానే ఉంది. కొత్తగా అప్పోయింట్ ఐన మేనేజర్ పలకరింపుతో తనకు సీసీటీవీ ఫుటేజీ కావాలి అని తాను టైం వేస్ట్ చేసే మనిషి కాదు అని చెప్పకనే చెప్పాడు . వెంటనే మేనేజర్ తన తాగుబోతు సెక్యూరిటీ గార్డ్ తో "సర్ ని సెక్యూరిటీ రూమ్ తీసుకొని వేళ్ళు " అని చెప్పి వెళ్ళిపోయాడు . రెండు ఘంటల పాటు ఫుటేజీ చూసిన రుద్ర కి ఒక్క విషయం కంటికి చికింది దొంగలు బ్యాంక్ లోకి వచ్చి దొంగతనం చేస్తున్నప్పుడు చాలా పద్ధతిగా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు లాక్కెర్ ఎక్కడున్నది అని మేనేజర్ కూడా అడగలేదు సరిగ్గా లాక్కెర్ దగ్గరికే వెళ్లారు . ముందు ఉన్న క్యాషీర్స్ ని భయపెట్టారు కానీ ఆ డబ్బు ని దొంగతనం చేయలేదు.
ఇప్పుడు రుద్ర అండ్ టీం ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు అందరు ఒక్కటే చెప్పారు దొంగలు వచ్చిన ఇరవై నిమిషాలలో నే అక్కడ ఉన్నవారి అందరికి చేతులు కాలు కట్టేసితరువాత కళ్ళకు గంతలు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి చెవిలో ఈర్ప్లగ్స్ పెట్టారు . దానితో అక్కడ ఉన్నవారు ఏది వినలేదు ఏది చూడలేదు . తరువాత 10 నిమిషాలలో సీసీటీవీ అన్నిటిని పగలకొట్టారు . అక్కడి క్యాషియర్ తనకు మందు వాసనా అప్పుడప్పుడు అని చెప్పే లోపల పక్కన వాళ్ళు తమకి ఎలాంటి వాసనా రాలేదు అని ఆమె పాయింట్ ని కొట్టిపారేశారు . తనకు ఇప్పటికి వస్తున్నా మందు వాసనకి చిరాకుగా సెక్యూరిటీ గార్డ్ ని బయటకు వెళ్ళిపోమన్నాడు . అక్కడి నుండి ఆ సెక్యూరిటీ ఫుటేజీ తో బైటకు వచ్చాడు . వర్షం బాగాపడుతుంది తన కార్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే పడవలతో ఆడుకుంటున్న చిన్న పిల్లలు చూసి తన చిన్నతనని గుర్తు తెచ్చుకుంటూ ఉండగా తన కార్ హార్న్ తో మేలుకొని ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.
ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డీటెయిల్స్ తో ఆలోచనలో పడ్డాడు అందులో 4 డిఎన్ఏ సాంపిల్స్ దొరికాయి చనిపోయి ఉన్న దొంగల ఫొటోస్ ని ఈపాటికే దేశం మొత్తం మీద గాలిస్తున్నారు . ఆ ఫొటోస్ చూస్తుంటే వాళ్ళు సౌత్ ఇండియన్స్ మాదిరిగానే అనిపిస్తున్నారు . రుద్ర ఆలోచనలో పడ్డాడు దొంగలు వాడిన మాస్క్ ని చూస్తుంటే అతనికి ఎక్కడో చూసినట్టు ఉంది వెంటనే గూగుల్ లో "రక్షా మాస్కస్" అని వెతికాడు తన బామర్ది శ్రీలంక నుంచి వచ్చినప్పుడు తన కు గిఫ్ట్ గా తెచ్చిన మాస్క్ లాంటిదే దొంగలు వాడిన మాస్క్.కానీ ఆ మాస్క్ ఇండియా లో కూడా అమ్ముతారు కానీ దొంగలు ఈ మాస్క్ ని ఎందుకు వాడారు ? . బ్యాంక్ కూడా తమిళనాడు లోనే ఉంది . దొంగలు శ్రీలంకన్ తమిళన్స్ అని డౌట్ తో చనిపోయిన దొంగల ఫొటోస్ ని శ్రీలంక కు పంపించాడు ఆఫీసర్ రుద్ర .బ్యాంక్ మేనేజర్ మూడు నెలల తరువాత మన ప్రపంచం లోకి వచ్చాడు . అతని ఇంటర్వ్యూ టీవీ లో చూస్తూ ఒకవేళ దొంగలు దొరికినా అంతడబ్బు ని ఎలా మాయం చేసారు వాళ్ళు van లోపలి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బ్యాగులతో వెళ్లారు కానీ లోపల కాళీ సంచులు మాత్రమే దొరికాయి . అసలు ఆ బ్యాంక్లో అంత డబ్బు ఉంటుందా అని డౌట్ తో బ్యాంక్ కి వెళ్ళాడు రుద్ర . తన ఫైనాన్సియల్ అసోసియేట్స్ తో బ్యాంక్ రికార్డ్స్ అన్ని చూడమని చెప్పి మల్లి బ్యాంక్ ని పరిశీలించడానికి వెళ్ళాడు . అది చెన్నై లో ఒక్క ప్రైవేట్ బ్యాంక్ సముద్రానికి రెండు కిలోమీటర్స్ దూరం లో ఉంది . కిందికి వచ్చిన రుద్ర కి రికార్డ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయ్ అని చెప్పారు ఆఫీసర్స్ . కానీ బ్యాంక్ మేనేజర్ ని బట్టి డబ్బు అంత vault లో స్టోర్ చేసాడు కానీ ఆ రూమ్ కి అంత డబ్బు స్టోర్ చేసే సామర్థ్యం లేదు . ఈ అనుమానం తో బ్యాంక్ మేనేజర్ ని కలవడానికి వెళ్ళాడు.అప్పుడే అక్కడ ఆ బ్యాంక్ చైర్మన్ చక్రధర్ ఉన్నాడు . రుద్ర రాక తో అయన లేచి తమిళ్ లో ఆయనకు వెల్కమ్ చెప్పాడు . ఆ తమిళ్ కొంచం భిన్నం గా ఉంది . మేనేజర్ తో ప్రైవేట్ గా మాట్లాడాలి అని చెప్పగానే చక్రధర్ వెళ్ళిపోయాడు. రుద్ర బ్యాంక్ గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు vault గురించి అడగానే మేనేజర్ తడబడ్డాడు . వెంటనే శివ ని పిలిచి చెవిలో ఎదో చెప్పి పంపించాడు . ఫైనాన్సియల్ రికార్డ్స్ లో ఉన్న లొసుగు మాకు తెలుసు అని బ్లఫ్ చేసాడు రుద్ర. మేనేజర్ తటపటాయించడం తో అతన్ని అదుపులోకి తీసుకొని తమదయిన స్టైల్ లో విచారణ చేస్తే ఇది అంతా చక్రధర్ చేసేడు అని తప్పు ఒప్పుకున్నాడు మేనేజర్ . చక్రధర్ ని అదుపులోకి తీసుకోమని శివ కు అరెస్ట్ వారెంట్ ఇచ్చి తాను DICGC హెడ్ ఆఫీస్ కి వెళ్ళాడు.
రుద్ర తిరిగి వచ్చేలోపల న్యూస్ అంతా దావానలం గా వ్యాపించింది . రిపోర్ట్స్ అడిగే ప్రశ్నలు వినకుండా తన ఆఫీస్ లోకి వెళ్ళిపోయాడు రుద్ర . రెండు ఘంటల తరువాత "బ్లడీ ఇంటెలిజెంట్ ఫెలోస్ " అని మాట తో స్టేషన్ మొత్తం నిశ్శబ్దం గా మారిపోయింది . రుద్ర చక్రధర్ ఉన్న సెల్ లోకి వెళ్లి సిగరెట్టే అంటించి చక్రధర్ వైపు చూస్తున్నాడు . చక్రధర్ ని తెచ్చి చాలా సేపు ఐన ఇంత వరకు అతను ఒక్క మాట కూడా చెప్పలేదు . రుద్ర మాట్లాడం మొదలు పెట్టాడు " నువ్వు చాలా తెలివి గా ఈ దొంగతనాని ప్లాన్ చేసావ్ అని అనుకుంటున్నావు కానీ చేసిన ప్లేస్ తప్పు అంతా చిన్న vault లో 100 కోట్లు పట్టవు నేను స్వయం గా vault ని కొలిచాను 100 కోట్లు మీ దగ్గర ఉన్నాయ్ అని RBI కి మీరు చెప్పింది సరిగ్గా దొంగతనానికి మూడు రోజుల ముందు సరిగ్గా వాళ్ళు వచ్చే టైం కి బ్యాంక్ లో దొంగతమ్ వాహ్ చాలా బాగుందయ్యా పుల్లారావు " అని చెప్తుంటే ఇదంతా కోఇన్సెడెన్సు అని చెప్పాడు చక్రధర్ . " సరే అదీ పక్కన పెడితే రెండు సంవస్త్రాలుగా 200 కూడా లేని మీ బ్యాంక్ అకౌంట్స్ సంఖ్య దొంగతనికి సరిగ్గా ఒక్క నెల ముందు 1000 పెరగడం కూడా కోఇన్సెడెన్సు అంటావా " అని చెప్పే లోపల చక్రధర్ మాట పడిపోయింది."DICGC వాళ్ళు ఒక్క వేళా బ్యాంక్ దొంగతనం జరిగితే ప్రతి కస్టమర్ కి ఒక్క లక్ష్య ఇస్తారని తెలిసి అంతా అమౌంట్ డిపాజిట్ అయ్యింది అని RBI ని నమ్మించడానికి ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి అదికూడా వారికి అకౌంట్స్ ఉన్నాయో లేవో తెలియని మీ బ్యాంక్ పక్కనే ఉన్న స్లం లో పేద వాళ్ళవి . ఇంత చేసేది ఎందుకు మీ బ్యాంక్ RBI దగ్గర నుండి తీసుకున్న అప్పు 100 కోట్లు వాటిని వాడి ఇప్పుడు ఈ ప్లాన్ వేశావు చక్రధర్ " అని చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర.
సిబిఐ డైరెక్టర్ చెన్నై కి వచ్చి రుద్ర ని అభిననందిచడానికి తన గెస్ట్ హౌస్ కి పిలిచాడు . " వన్ మోర్ కేసు సొల్వెడ్ ప్రౌడ్ అఫ్ యు " అని డైరెక్టర్ చెప్తున్నా రుద్ర ఇంకా ఆలోచలలో ఉన్నాడు . " కేసు ఇంకా అయిపోలేదు సర్ ఇప్పుడే శ్రీలంక నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ చనిపోయిన దొంగలు అక్కడి మన కోసం పని చేసిన ఇన్ఫోర్మాంట్స్ సర్ " అని చెప్పే లోపల
డైరెక్టర్ మొఖం లోని చిరునవ్వు మాయం అయిపోయింది . " అవును సర్ నేను అందుకే ఈ కేసు ఇంకా క్లోజ్ చేయలేదు కానీ మనం కేసు ఛేదించడానికి కి దగ్గరగా వచ్చాము "
.................... తరువాత ( అంతం )
Comments
Post a Comment