Posts

Showing posts from January, 2022

CASE 01(బ్యాంక్) - అన్వేషణ

Image
రాత్రి నిద్ర రాక పోవడం తో తన ఇన్వెస్టిగేషన్ ఆల్బం ని తీసాడు . అందులో అతను ఇప్పటివరకు సాల్వ్ చేసిన కేసెస్ గురుంచి అన్ని డీటెయిల్స్ ఉన్నాయ్ .కొన్ని సంవత్సరాల  ముందు  ఈనాడు పేపర్ లో వచ్చిన హెడ్డింగ్ ని చూస్తూ అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయతినిస్తున్నాడు.  "పట్టపగలు 100 కోట్ల తో మాయమైన దొంగలు ". తన యాబై సవంత్సరాల  కెరీర్లో సాల్వ్  చేసి తనకు గుర్తింపు వచ్చిన చాలా కేసులలో ఇదీ  ఒక్కటి . ఇప్పుడు రిటైర్మెంట్  తరువాత ఇవే తన స్నేహితులు . తన చేతిలో ఉన్న కాఫీని సిప్ చేస్తూ సిగార్ ని అంటించి కళ్ళుమూసుకున్నాడు . అది  2019 లో వర్షాకాలం మెల్లగా పడుతున్న వర్షంలో వేడి టీ ని తాగుతూ తనకు కొత్తగా వచ్చిన కేసు ఫైల్ చూస్తూ ఉన్నాడు. అందరు చూస్తూ ఉండగానే మాయమైన 100 కోట్ల డబ్బు , నలుగురు దొంగలు , పట్టపగలు . తనకి సహాయంగా ఉండడానికి వచ్చిన నలుగురు పోలీసులని తీసుకొని దొంగతనం జరిగిన స్పాట్ కి వెళ్లారు . అప్పటికే దొంగతనం జరిగి మూడు నెలలు గడిచింది . తనకు ఫోరెన్సిక్ రిపోర్ట్ కావాలి అని తన అసోసియేట్ శివ కి చెప్పి కార్ నుండి దిగి బ్యాంకు లోపలి వెళ్ళాడు...

CASE 01(బ్యాంక్) - ఆరంభం

Image
బ్యాంక్ లో అలారం మోగడం స్టార్ట్ అయ్యింది అటుగ వెళ్తున్న జనం ఒక్క సారిగా ఆగిపోయి  బ్యాంక్ వైపే చూస్తున్నారు . తమ మొబైల్ ఫోన్స్ తో వీడియో తీయడం స్టార్ట్ చేసారు కానీ ఒక్కరు మాత్రం సాహసించి పోలీసులకు ఫోన్ చేసారు . ఫోన్ చేయడం  కూడా సాహసంగా మారిపోయిన సమాజం లో బతుకుతూనాం .అంతలోనే ఒక్క దొంగ ముసుగులో బయటకు వచ్చి అక్కడ పార్క్ చేసి ఉన్న VAN నుంచి ఒక్క బాగ్ తో లోపలకి వెళ్ళాడు . చాల సేపటి తరువాత పోలీసులు వచ్చి బ్యాంకును  నాలుగు వైపులా చుట్టిముట్టారు . పోలీస్ అక్కడి జనాన్ని మొత్తం కాళీ చేయించారు అప్పటికే జనాలు చిరు తిండ్లు కొనుకొన్ని మరి దొంగతనాని చూస్తున్నారు MONEY HEIST వల్ల అందరిలో ఆసక్తి ఇంకా పెరిగింది . పోలీసులు మెగాఫోన్ తో దొంగలతో మాట్లాడానికి ట్రై చేస్తున్నారు  కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ మాత్రం లేదు . ఇంతలోపల బ్యాంక్ నుండి కాల్పులు వినపడుతున్నాయి పోలీసులు లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు . ఇంతలో లోపలఉన్న వారు అందరు పరిగెత్తుకుంటూ బైటికి రావడం మొదలు పెట్టారు ఒక్క 5 మంది మాత్రం అక్కడ ఉన్న  VAN లోపలి వెళ్లారు . వెంటనే పోలీసులు VAN ని చుటుముట్టారు . ముసుగు ...